AP Inter Results: ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స
ABN, First Publish Date - 2023-04-26T18:50:51+05:30
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter results) విడుదలయ్యాయి.
విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://examresults.ap.nic.in లో అందుబాటులో ఉంచారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 4,33,275 మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలను 3,79,758 మంది విద్యార్థులు రాశారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇంటర్ ఫస్టియర్‌లో 61 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 46 శాతం ఉత్తీర్ణతతో ఆఖరి స్థానంలో కడప జిల్లా ఉందని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సుమారు 10 లక్షల మంది హాజరయ్యారు. 9,20,552 మంది రెగ్యులర్ విద్యార్థులు, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసింది.
ఇక షెడ్యూలు విడుదల చేయకముందు ఎవరూ అడ్మిషన్లు తీసుకోవద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు అన్ని కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. జూన్ 1కి ముందు తరగతులు నిర్వహించొద్దన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీలు, హైస్కూల్ ప్లస్‌లు, ఏపీఆర్‌జేసీ, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, రైల్వే, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఒకేషనల్ జూనియర్ కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని వివరించారు.
Updated Date - 2023-04-26T19:22:14+05:30 IST