Somireddy: ఆగ్రోస్ కుంభకోణంలో మంత్రి కాకాణి పాత్ర: సోమిరెడ్డి
ABN, First Publish Date - 2023-06-12T21:26:01+05:30
ఆగ్రోస్‌లో జరిగిన భారీ కుంభకోణం వెనుక వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాత్ర ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపించడంతోపాటు కాకాణిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు పంపిణీ చేసే వ్యవసాయ పరికరాల నుంచి అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్ల వరకు అన్నింటా స్కామ్‌లే జరుగుతున్నాయని ఆరోపించారు.
నెల్లూరు: ఆగ్రోస్‌లో జరిగిన భారీ కుంభకోణం వెనుక వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి (Kakani Govarthan Reddy) పాత్ర ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపించడంతోపాటు కాకాణిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు పంపిణీ చేసే వ్యవసాయ పరికరాల నుంచి అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్ల వరకు అన్నింటా స్కామ్‌లే జరుగుతున్నాయని ఆరోపించారు. ఆగ్రోస్‌లో రైతు పరికరాల పంపిణీలో భారీ కుంభకోణం జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ చైర్మన్ అయిన వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ సీఎంకు లేఖ రాశారని సోమిరెడ్డి గుర్తు చేశారు. నాసిరకమైన పరికరాలు, పట్టలు పంపడమేగాక అధిక ధరలకు విక్రయించాలని ఆగ్రోస్ సిబ్బందికి టార్గెట్ పెడితే వారు తిరగబడ్డారని చెప్పారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా రెండేళ్ల కాలంలో 23,500 ట్రాక్టర్లు పంపిణీ చేస్తే, సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్లలో రెండు సార్లు జెండా ఊపినా ఆరు వేలు ట్రాక్టర్లు పంపిణీ చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు.
Updated Date - 2023-06-12T21:26:15+05:30 IST