ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Appalaraju: రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-21T16:54:21+05:30

రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నెలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) విశాఖపట్నం రాజధానిగా పాలన ప్రారంభిస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju) చెప్పారు. కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నా సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని మంత్రి స్పష్టం చేసారు. మొన్న తాను తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సమర్దించుకున్నారు. జగన్‌ను ఎవరైనా అంటే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

స్వామి భజనకూ హద్దుండాలంటారు. మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju)కు మాత్రం ఈ హద్దే ఉండదు మరి. ప్రతిపక్షాలపై విరుచుకుపడడం.. సీఎం జగన్‌ (CM Jagan)పై స్వామిభక్తి చాటుకోవడం ఆయనకు పరిపాటైంది. ఇటీవల మంత్రి పదవి పోతుందని ప్రచారం జరిగినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువైనట్లు ఉంది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పలాస-కాశీబుగ్గ సమీపంలోని కిడ్నీ రిసోర్స్‌ సెంటర్‌ (Kidney Resource Center) 200 పడకల ఆసుపత్రి వద్ద గురువారం ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న సీఎం జగన్‌ మాస్క్‌ ముఖానికి తగిలించుకుని కుర్చీలో కూర్చుని మరీ ఫొటోలు తీయించుకున్నారు.

పనిలోపనిగా ఎప్పటిలాగే టీడీపీపై నోరుపారేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)పై ఆరోపణలు గుప్పించారు. 14 ఏళ్లు మఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. 978 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక్కపోర్టు గానీ, హార్బర్‌ గానీ నిర్మించారా? అని ప్రశ్నించారు. అయితే వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల పాటు మిన్నకుండిపోయి తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక పోర్టు శంకుస్థాపన అంటూ హడావుడి చేయడం గురించి చెప్పరేం అని మంత్రి వ్యాఖ్యలను విన్నవారు నోరెళ్లబెట్టుకున్నారు. జగన్‌ను విమర్శిస్తే సహించేదిలేదని మంత్రి సీదిరి హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పలరాజు వార్నింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2023-04-21T16:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising