MP Arvind: ఈడీ నోటీసులను మోదీ నోటీసులుగా కవిత వర్ణించడంపై ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-09-14T20:00:52+05:30
కల్వకుంట్ల కవిత లాంటివాళ్ళు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్ళు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి.
నిజామాబాద్: ఈడీ నోటీసులను (ED notices) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటీసులుగా (Modi notices) కవిత (Kavitha) వర్ణించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ (MP Arvind) స్పందించారు. మోదీ పట్ల కవిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కల్వకుంట్ల కవిత లాంటివాళ్ళు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్ళు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి. వీళ్ళ కుటుంబం చేసిన అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రం రెండు దశాబ్దాల పాటు వెనుకకు వెళ్ళిపోయింది. ఎంత తొందరగా నేరారోపణ రుజువై దోషిగా తేలితే, చట్టం వీళ్ళని రాజకీయాల నుంచి బయటికి తరిమేస్తే సమాజానికి అంత మేలవుతుంది. ఈమె చేసిన చెడు పనులకు ఈడీ నోటీసులు పంపిస్తే, వాటిని మోడీ నోటీసులుగా వర్ణించడం.. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన అహంకారపు పరాకాష్ట మాటలకు నిలువెత్తు నిదర్శనం." ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-14T20:02:05+05:30 IST