ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Suresh: తాగినోళ్ళే ఊగుతారు, వాగుతారు.. పవన్ ఎందుకు ఊగుతున్నారు

ABN, First Publish Date - 2023-07-01T14:29:27+05:30

రౌడీయిజం చేసే వ్యక్తిలాగా, ఒక అసాంఘిక శక్తిలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మాట్లాడారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రౌడీయిజం చేసే వ్యక్తిలాగా, ఒక అసాంఘిక శక్తిలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Janasena Chief Pawankalyan) మాట్లాడారని ఎంపీ నందిగం సురేష్ (MP Nandigam Suresh) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎవ్వరినైనా ఏమైనా తిట్టొచ్చు, ఎవ్వరూ నన్ను ఏమీ అనకూడదు’’ అన్నట్లుగా పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో ఎలా జరుగుతుందో అలానే సభలో తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు చేద్దామని పవన్‌కు లేదని.. ఆయన ఊగిపోతూ ప్రత్యర్ధులను తిడుతున్నారని మండిపడ్డారు. పోట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజుల గురించి చెపుతూ చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) పొగిడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న భానిసత్వంలో ఎలాంటి అలసట లేకుండా పనిచేస్తున్నారని విమర్శించారు. గాజువాక, భీమవరం రెండు చోట్ల చంద్రబాబు చెప్పినట్టు పోటీ చేశారని.. అందుకే రెండు చోట్ల పనన్‌ను ఓడించారన్నారు.

పవన్ కళ్యాణ్ ఏ క్లాస్‌ను సమర్ధిస్తున్నారని తెలిపారు. పవన్ రెండు నియోజకవర్గాల కోసం ఖర్చు చేసిన సంపద ఏ క్లాస్ ఖర్చు పెట్టిందని తెలిపారు. జగన్ కన్నా మంచిగా అభివృద్ధి చేస్తామని అంటున్నారన్నారు. జగన్ పేదలకు డబ్బులు ఇస్తుంటే శ్రీలంక అవుతుందన్న తమరు.. ఇప్పుడు అంతకన్నా మంచి చేస్తామని ఎలా చెపుతారని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారని అన్నారని.. కానీ పవన్ దీన్ని వ్యతిరేకించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏ ఇజం ఎంచుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తాగినోళ్ళే ఊగుతారు, వాగుతారని.. ఇంతకీ పవన్ ఎందుకు ఊగుతున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ఎదుర్కోవడానికి వంద తలలు పెట్టుకుని వీరందరూ వస్తున్నారంటూ ఎంపీ నందిగాం సురేష్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-01T14:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising