ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Highcourt: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టులో మరో పిటిషన్

ABN, First Publish Date - 2023-06-08T12:49:13+05:30

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama krishna raju) కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టులో (AP Highcourt) మరో పిటిషన్ దాఖలైంది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారం హైకోర్టులో విచారణకు రావడంతో రఘురామ కృష్ణ రాజు తరపు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ వాదనలు వినిపించారు. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ వైద్యుల నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు. రెండు సంవత్సరాలు పూర్తి అవ్వడంతో ఈ నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి లాయర్ తీసుకొచ్చారు. అలా చేస్తే ఈ కేసు దర్యప్తులో కీలక ఆధారాలు మాయం అయిపోతాయని... వీటన్నింటినీ భద్రపరచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై వెంటనే లిఖిత పూర్వక కౌంటర్లు దాఖలు చేయాలని గుంటూరు ఆసుపత్రి సూపరెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే మంగళవారం(జూన్ 13)కు వాయిదా వేసింది.

Updated Date - 2023-06-08T12:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising