ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Vijayasai Reddy: చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్.. ఆధారాలు దొరికితే లోకేష్‌పై కూడా చర్యలు

ABN, First Publish Date - 2023-09-12T19:33:40+05:30

ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితిపై వైసీపీ (YCP) రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) సమీక్షించారు.

ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితిపై వైసీపీ (YCP) రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) సమీక్షించారు. జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ సమస్యలు గుర్తించి సరిదిద్దుతామని, జిల్లాలో సమస్యలు పరిష్కరించే బాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డి చూసుకుంటారని విజయసాయిరెడ్డి అన్నారు.


"గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. నిన్న టీడీపీ బంద్‌లో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా స్పందించి మూయలేదు. చంద్రబాబు ఆయన మహానాయకుడు అని నమ్మించే ప్రయత్నం చేసే మీడియా కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. విద్యార్థి దశ నుంచే నేర పూరిత ఆలోచనలు చేసే చంద్రబాబు. ఆయన సొంత మీడియా ఆయన విజనరీ ఉన్న నేత అని చేసిన ప్రచారం డొల్ల అని తేలింది. సీమెన్స్ కంపెనీ పెట్టుబడుల్లో లోకేష్ ముఖ్య అనుచరుడు కిలారి రాజేష్ ది ప్రముఖ పాత్ర. రాష్ట్రంలో రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆయన ఓటుకు నోటు రాజకీయాలు అందరికీ తెలుసు. స్వతహాగా కరిష్మా లేని నేత చంద్రబాబు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఆయన ఇన్ సైడ్ ట్రేడింగ్ అందరికీ తెలుసు." అని వైసీపీ ఎంపీ మండిపడ్డారు.

"జ్యుడీషియల్ వ్యవస్థలో కూడా తన సొంత సామాజిక వర్గ నేతలతో స్టేలు తెప్పించుకునే నేత చంద్రబాబు. 14 ఏళ్ల సీఎంగా ఆయన చేసిన ప్రతీ పనీ ఓ స్కామే. చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్. చంద్రబాబు అరెస్ట్ లోకేష్, ఎల్లో మీడియాకు మింగుడు పడని అంశం. లోకేష్ కు దైర్యం ఉంటే చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్టే వెకేట్ చేయించాలి. రూ. 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారు. డబ్బులో ఒక్క రూపాయి కూడా రాలేదని సిమెన్స్ సంస్థ స్పష్టం చేసింది. కుంభకోణం చేసింది మొత్తం చంద్రబాబు అని ఈడీ కూడా బయట పెట్టింది. ప్రతి పనిలో ప్రజా ధనం చంద్రబాబు దుర్వినియోగం చేశారు. బాబు అరెస్టుపై మాట్లాడేందుకు టీడీపీ వాళ్లే ముందుకు రాలేదు. అందుకే బాబు రెప్రజెంటేటివ్స్ ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలతో ట్వీట్స్ పెట్టిస్తున్నారు. చంద్రబాబు పరామర్శకు రావాలని స్పెషల్ ఫ్లైట్స్ పెడుతున్నారు. " అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

"చంద్రబాబు నేరాల్లో రామోజీ పాత్రపై విచారణ జరగాలి. ఆర్నేళ్ళలో అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చినా న్యాయంగా పనులు చేసిన మమ్మల్ని ఏం చేస్తారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ కోవర్ట్ అని మేము భావిస్తున్నాం. జనసేన, టీడీపీ రెండు త్వరలో కలుస్తాయని అందరూ మాట్లాడుకునే మాట. ఎవరో ఒక అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అరెస్టు జరిగింది అనటం అవాస్తవం. ఆధారాలు దొరికితే నారా లోకేష్ పై కూడా చర్యలు తీసుకుంటాం." అని విజయసాయిరెడ్డి అన్నారు.

Updated Date - 2023-09-12T19:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising