ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ippatam: జగన్‌పై మండిపడ్డ నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2023-03-05T19:21:07+05:30

సీఎం జగన్‌ (CM Jagan)పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మండిపడ్డారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు మనోహర్ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: సీఎం జగన్‌ (CM Jagan)పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మండిపడ్డారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పేరుతో మళ్లీ మార్కింగ్ మార్చడం రాజకీయ కుట్రేనని దుయ్యబట్టారు. సైకో సీఎం కాబట్టే ప్రజలపై కక్షకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభలకు జనం స్థలం ఇవ్వకూడదా?, సభలకు రాకూడదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు‌ చేయకుండా జగన్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌ అయిన జగన్‌ను జనం ఎలా నమ్ముతారు? ప్రశ్నించారు. ధ్వంసాలు, విధ్వంసాలే జగన్‌రెడ్డి పాలన అంటూ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు.

ఇప్పటం (Ippatam)లో జనసేన ప్రతిఘటనతో అప్పట్లో నిలిచిపోయిన కూల్చివేతలు శనివారం మళ్లీ మొదలయ్యాయి. భారీ పోలీసు బందోబస్తుతో వచ్చిన ఎంటీఎంసీ అధికారులు రెండు ఎక్స్‌కవేటర్లతో సుమారు 12మందికి చెందిన ప్రహరీలను కూల్చివేశారు. పలు ఇళ్లకు లోపలి వరకు మార్కింగ్‌ ఇచ్చారు. గ్రామంలోకి బయటివారిని రానివ్వలేదు. తనిఖీలు చేసి మరీ గ్రామంలోకి అనుమతించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జనసేన నేత టి.నరసింహారావు నివాసం వద్ద కూల్చివేతకు ఉపక్రమించగా ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ప్రహరీ కూల్చి వదిలేశారు. పి.నరసింహారావు, ఇండ్ల వెంకట నరసయ్య, సాంబయ్య, గాజుల లక్ష్మీనారాయణ, ఉమ, పద్మ తదితరులకు చెందిన ప్రహరీలను కూల్చి వేశారు. ఓ ఇంటి డాబా పైకి ఎక్కి డ్రిల్లింగ్‌తో శ్లాబ్‌కు బొక్కలు పెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో అధికారులు కక్షసాధింపు చర్యలతోనే కూల్చివేస్తున్నారని, మార్కింగ్‌లు ఇస్తున్నారని జనసేన నాయకులు నిరసనకు దిగారు.

Updated Date - 2023-03-05T19:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising