Nakka Anand Babu : రైతులకు న్యాయం జరిగే వరకూ టీడీపీ అండగా ఉండి పోరాటం చేస్తుంది
ABN, First Publish Date - 2023-05-06T12:03:35+05:30
అకాల వర్షంతో వేమూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న , జొన్న , పసుపు పంట దెబ్బతిన్నాయన్నారు.
బాపట్ల : అకాల వర్షంతో వేమూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న , జొన్న , పసుపు పంట దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం తప్పించుకోవటానికి కుంటి సాకులు చెబుతూ అడ్డ దారులు వెదుకుతోందన్నారు. రైతుకి ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి ఖర్చు అయ్యిందన్నారు. మొక్కజొన్న తడిచి వాసన వస్తోందన్నారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే ప్రజలకు రోగాలు కూడా వస్తాయని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. పొలాల్లో పంటలు కొయ్యని వాటికి కూడా నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులు, నాయకులు క్షేత్ర స్థాయిలో రైతులను కనీసం పరామర్శించలేదని విమర్శించారు. లంక గ్రామాల్లో పంటలు ఇంకా నీళ్లలోనే తేలుతోందన్నారు. మొక్కజొన్న మొదట 1962 ధర ఉంటే ఇప్పుడు 1600 కూడా కొనే దిక్కు లేదన్నారు. రైతు దగ్గర ఆఖరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంటలు కొనకుండా కుంటి సాకులు చెబితే రైతులతో కలిసి రోడ్డు ఎక్కుతామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ టీడీపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని నక్కా ఆనంద్ బాబు తెలిపారు.
Updated Date - 2023-05-06T12:03:35+05:30 IST