Bhuvaneswari: చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి రాకుండా చేసి జగన్ గెలవాలని చూస్తున్నారు
ABN, First Publish Date - 2023-10-26T19:14:45+05:30
తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మహిళలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి సమాధానాలు చెప్పారు. చంద్రబాబు తన మనవడు దేవన్ష్‌ను చూసి 48 రోజులైంది. వాడికి ఇవ్వన్నీ చెప్పలేక తాత విదేశాలకు వెళ్లారని చెప్పామని ఆమె తెలిపారు.
"ములాకత్‌కు ఇచ్చిన 30 నిమిషాల్లో 20 నిమిషాలు పార్టీ గురించి, తెలుగుదేశం బిడ్డల గురించి మాట్లాడుతారు. ఎవరు ఏం చేసినా ఆయన వనకడు, బెదరడు. తెలుగుదేశం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పమన్నారు. ఆయనకు కోట్లాది మంది ప్రేమ అందుతోంది. అది నాకు గర్వంగా ఉంది. చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి రాకుండా చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర సక్సెస్, చంద్రబాబు పర్యటన విజయవంతంగా అవుతుండటం చూసి భయపడి, ప్రజల నుంచి దూరం చేయాలని, మనల్ని ఇలా భయపెట్టాలని చూస్తున్నారు. త్వరలో లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారు." అని భువనేశ్వరి అన్నారు.
"ఎన్నికల్లో ఓటు వేసే ముందు రాష్ట్ర భవిషత్తును చూసి వేయండి. నేను చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు, ఎన్టీఆర్ నుంచి పౌరుషం ఈ రెండు నన్ను అన్ని పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతోంది. చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెపుతూ రాసిన లేఖపై ఈ ప్రభుత్వం విచారణ చేస్తుందట. ప్రభుత్వం సమయం ఎంతో విలువైనది. వర్షాలు లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఏం చేయాలని చూడాలి. ఇలా లేఖ గురించి విచారణ పేరుతో సమయం వృధా చేయటం పిచ్చి ఆలోచన మాత్రమే. పంపుతున్న భోజనాల గురించి వారి మాటలను చూస్తే... పని లేని వారి గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు అనిపిస్తుంది. మీ బిడ్డలు మీకు విషం కలిపి ఇస్తారా?. రాజకీయ నేతను పెళ్లి చేసుకుని నేను మాత్రం చాలా నేర్చుకున్నాను. ప్రతి మహిళ తనపైన తనకు నమ్మకం ఉంచాలి. తను ఏది సరైన దారి అనుకుంటారో దాన్ని గుర్తించాలి." అని భువనేశ్వరి అన్నారు.
Updated Date - 2023-10-26T19:14:45+05:30 IST