ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nijam Gelavali : జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగిన నారా భువనేశ్వరి!

ABN, First Publish Date - 2023-10-25T19:15:21+05:30

వైసీపీ ప్రభుత్వంపై (YCP GOVT) టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి: వైసీపీ ప్రభుత్వంపై (YCP GOVT) టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ఆమె నిప్పులు చెరిగారు.


"రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భందించారు. నిజం గెలవాలి. నిజం గెలవటం ఒక పోరాటం. ఆ పోరాటం నాది కాది. మన అందరిదీ. రాష్ట్రం భవిష్యత్తు కోసం ఈ పోరాటం. ఎన్టీఆర్ కుమార్తెగా గర్విస్తున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా సేవలు చేశా. 3 వేల మంది అనాధ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం. తిరుపతిలో వరదలు వస్తే వారికి అండగా నిలబడ్డాం. చంద్రబాబును నేను ఆయన ఎదురుగా ఎప్పుడు పొగడ లేదు. ఆయన నెగెటివ్ పాయింట్స్ నేను చెప్పేదాన్ని. విభజన రాష్ట్రంలో ఆయన పడిన తపనను చూసి ఎన్నో సార్లు ఆయన ఆరోగ్యం పై ఆందోళన చెందా. ఐటీ విషయంలో నేను నెగిటివ్ గా చెపితే, భవిష్యత్తులో చూడమని చెప్పారు. అలాంటి విజనరీ పై తప్పుడు కేసులు పెట్టారు. మొదట మూడు వేల కోట్లు అన్నారు. తర్వాత 300 కోట్లు అన్నారు. తర్వాత 27 కోట్లు అంటున్నారు. వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతోంది. అందరిపైనా కేసులు. ఎవరిని కలిసినా 20, 30 కేసులు ఉన్నాయి అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే ద్యాస. తప్పుడు కేసులు పెట్టడమే. పరిపాలన ఉందా, భయ పెట్టడం తప్ప అభివృద్ధి లేదు. ఏ రాష్ట్రానికి ఇలాంటి కష్టం రాకూడదు. చెయ్ చెయ్ కలిపి ముందుకు వెళ్దాం. చంద్రబాబునీ అరెస్ట్ చేస్తే ఆయన మానసికంగా శారీరకంగా కృంగి పోతారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయనది స్ట్రాంగ్ పర్శనాలిటీ. ఆయన ఇంకా ధైర్యంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, మన హక్కులు కాలరాస్తున్నారు. అడుగు వెనక్కు వేయకూడదు. తెలుగు పౌరుషం ఎంటో వారికి చూపించాలి. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బందించారు. నిజం గెలవాలి. నిజమే గెలవాలి." అని సత్యమేవ జయతే అని నారా భువనేశ్వరి నినాదాలు చేయించారు.

Updated Date - 2023-10-25T21:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising