ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshPadayatra: శ్రీసత్యసాయి జిల్లాలోకి నారా లోకేశ్‌ తొలి అడుగు

ABN, First Publish Date - 2023-03-17T21:28:47+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుట్టపర్తి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించింది. అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర ముగించుకుని, శుక్రవారం సాయంత్రం శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులోని చీకటిమానిపల్లికి చేరుకుంది. పాదయాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapur District) నుంచి టీడీపీ నేతలు, శ్రేణులు తరలివచ్చి, లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. 45వ రోజు జిల్లాలో 3.2 కిలోమీటర్ల మేర లోకేశ్‌ యువగళం పాదయాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వేలాదిమంది లోకేశ్‌ వెంట పాదయాత్రలో నడిచారు. చీకటిమానిపల్లి, గంగసానిపల్లి మధ్యలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి లోకేశ్‌ చేరుకున్నారు. సాయంత్రం 5.28 నుంచి 6.53 గంటల వరకు 1.25 గంంటలు జిల్లాలో పాదయాత్ర సాగింది. పాదయాత్రలో దారిపొడవునా జనంతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనతోపాటు స్వాగతం పలికారు. నారా లోకేశ్‌ను స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పరిటాలసునీత, కొల్లు రవీంద్ర, అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పరిటాల శ్రీరామ్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T21:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising