ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam : నారా లోకేష్ మూడో రోజు పాదయాత్ర షెడ్యూల్ ఇదే.. రేపు సాయంత్రం 5 గంటలకు...!

ABN, First Publish Date - 2023-01-28T18:25:26+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Nara Lokesh) శ్రీకారం చుట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర రెండ్రోజులు పూర్తి చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Nara Lokesh) శ్రీకారం చుట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర రెండ్రోజులు పూర్తి చేసుకుంది. మొదటి రోజు 8.5 కిలోమీటర్లు, రెండో రోజు శాంతిపురం మండలంలో 9.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. రేపు అనగా మూడోరోజు పాదయాత్ర ఏయే ప్రాంతాలమీదుగా ఉంటుంది..? ఏ సమయంలో ఏ ప్రాంతాల్లో పాదయాత్ర సాగనుంది..? ఎప్పుడు సమావేశాలు ఉంటాయి..? అనే విషయాలను లోకేష్ టీమ్ (Lokesh Team) ఓ ప్రకటనలో తెలిపింది. 3వ రోజు మొత్తం 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

3వ రోజు షెడ్యూల్ ఇలా..

8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం

8.45 AM – ప్రముఖులతో సమావేశం

9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం

12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్‌లో స్థానికులతో మాటమంతీ

12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం

3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు

5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌కు చేరిక.. ప్రముఖులతో సమావేశం

5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస.

రెండోరోజు ఇలా..!

రెండో రోజు (Second Day) పాదయాత్ర శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. కుప్పం (Kuppam) పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి యాత్రను ప్రారంభించారు. గుడుపల్లె మండలం, బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేష్‌ సమావేశం అయ్యారు. మధ్యాహ్నం కనుమలదొడ్డిలో భోజన విరామం తీసుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పలమనేరు-కుప్పం హైవే పక్కన ఇవాళ రాత్రి లోకేష్.. బస చేయనున్నారు.

ఒకే సెంటిమెంట్..!

కాగా.. మొదటి రోజున టీడీపీ కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ.. ఇక్కడి లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. సరిగ్గా 11:03 గంటలకు ఆలయం నుంచి తొలి అడుగు వేసి చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ (Telugudesam) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ పాదయాత్రను భావిస్తోంది. దీనిని లోకేశ్‌ తన తండ్రికి ఎంతో సెంటిమెంటు అయిన ప్రాంతం నుంచి ప్రారంభించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటనలు (Kuppam Tours), ర్యాలీలను లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేసే ప్రారంభించారు. ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసే సమయంలోనూ ఇదే గుడిలో పూజలు జరిపిస్తారు. లోకేశ్‌ కూడా పాదయాత్రను ఇదే గుడిలో పూజలు చేసి ప్రారంభించారు.

పూల వర్షం.. హోరెత్తిన నినాదాలు..!

మొదటి రోజు.. లోకేశ్‌ తొలి అడుగు వేయగానే కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. ‘జై లోకేశ్‌.. జై తెలుగుదేశం’ (Jai Lokesh.. Jai Telugudesam) అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాదయాత్రకు అనుమతులు ఇచ్చినప్పుడే ప్రైవేటు సెక్యూరిటీ (Private Security) ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో టీడీపీ నాయకులు తొలి రోజు 500 మంది పార్టీ వలంటీర్లను, 200 మంది బౌన్సర్లను నియమించుకున్నారు. 500 మంది పోలీసులతో (Police) బందోబస్తు ఏర్పాటుచేసినా.. ఎక్కడా వారి ప్రమేయం కనిపించలేదు. వారి అవసరం లేకుండానే పార్టీ వలంటీర్లు బందోబస్తు నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించారు.

Updated Date - 2023-01-28T19:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising