ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NaraLokesh: లోకేష్ పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు

ABN, First Publish Date - 2023-02-22T19:21:27+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NaraLokesh) యువగళం పాదయాత్ర(YuvaGalamPadayatra)కు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NaraLokesh) యువగళం పాదయాత్ర(YuvaGalamPadayatra)కు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. లోకేష్ వికృతమాలకు రాకుండా పోలీసులు విధించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. గ్రామాల్లో ఇరుకైన రోడ్లపై లోకేష్ పర్యటించడం ఇబ్బంది అవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇరుకు రోడ్ల పేరుతో లోకేష్ పాదయాత్రను గ్రామాల్లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని చేసే ప్రయత్నమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్‌ను జనాలు, గ్రామాలు లేని రోడ్డులో వెళ్లమని పోలీసులు చెప్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యేర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లోకేష్పై దాడి చేసేందుకు వైసీపీ మూకలు ఏర్పాట్లు చేసుకున్నారు. ముందే పసిగట్టిన టీడీపీ (TDP) నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీడీపీ ఫిర్యాదుతో వైసీపీ నేతలతో పోలీసులు మాట్లాడి వచ్చారు. వైసీపీ (YCP) నేతలతో మాట్లాడామని ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. పాఠశాలలో వైసీపీ నేతలకు ఏం పని అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. లోకేష్ పర్యటనకు రక్షణగా వచ్చారా?.. వైసీపీ నేతలకు కాపలాగా వచ్చారా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

లాయర్లకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..

నడిరోడ్డుపై నగ్నంగా ఓ మహిళ రచ్చ రచ్చ.. బలవంతంగా స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఏంటీ పని అని నిలదీస్తే ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-02-22T19:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising