Naveen Case: పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు చెప్పిన నిందితుడు
ABN, First Publish Date - 2023-03-04T18:02:46+05:30
అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో (Naveen Case) హరిహర కృష్ణ (Hariharakrishna) పోలీసులు (Police) రెండో రోజు ప్రశ్నిస్తున్నారు.
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో (Naveen Case) హరిహర కృష్ణ (Hariharakrishna) పోలీసులు (Police) రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలను నిందితుడు వెల్లడించారు. యూట్యూబ్‌లో పోస్టుమార్టం వీడియోలను హరిహర సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను చూసి నవీన్ శరీరభాగాలను హరిహర వేరు చేశారని పోలీసులు చెప్పారు. నవీన్ హత్యలో స్నేహితుల సాయం తీసుకున్నట్లు హరిహర వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. హత్యకు ముందు, తర్వాత ఎక్కువగా హరిహర ఫోన్లు మాట్లాడారని, కాల్ రికార్డ్స్ ఆధారంగా స్నేహితుల లిస్ట్ తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవీన్‌ను దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని ఆరా హరహరను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene reconstruction) చేపట్టారు. ముందుగా హరిహరకృష్ణను తన సోదరి ఇంటికి తీసుకెళ్లారు. హత్యకేసులో ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవీన్‌ను దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నవీన్‌ను తీసుకొచ్చింది ఎవరు?.. అక్కడ అతనికి సహకరించింది ఎవరు? అంటూ పలు కోణాల్లో విచారణ చేపట్టారు. నవీన్ హత్య వెనుక యువతి పాత్రపైనా విచారణ బృందం ఆరా తీస్తోంది.
యువతి కోసం స్నేహితుడిని అతికిరాతకంగా చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నల్గొండ ఎంజీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌కు.. అదే కళాశాలలో చదువుతున్న హరిహరకృష్ణతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. విషయం తెలుసుకుని ఇరువురు కొద్దిరోజులుగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని తప్పించాలని హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. దాని ప్రకారం ఫిబ్రవరి 17న ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు.
నవీన్ తీవ్రంగా గాయపరిచిన హరిహరకృష్ణ... అతడి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అత్యంత కిరాతంగా నవీన్ తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి, మర్మాంగాలు కోసేశాడు. పేగుల బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. ఆపై అక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్లిన హరిహరకృష్ణ హత్య గురించి చెప్పాడు. ప్రియురాలికి కూడా చెప్పడంతో పోలీసుల ఎదుట లొంగిపొమ్మని సూచించింది. చివరకు తండ్రి సూచన మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల వద్ద హరిహరకృష్ణ లొంగిపోయాడు. అయితే తన కుమారుడు మాత్రమే ఈ హత్య చేసి ఉంటాడని తాను అనుకోవట్లేదని హరిహర తండ్రి అంటున్నారు.
Updated Date - 2023-03-04T18:02:46+05:30 IST