ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CMO: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి సీఎం ఆఫీస్ నుంచి పిలుపు

ABN, First Publish Date - 2023-01-06T17:15:56+05:30

నెల్లూరు రూరల్ వైసీపీ (YCP) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం ఆఫీస్ (CMO) నుంచి పిలుపు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు రూరల్ వైసీపీ (YCP) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం ఆఫీస్ (CMO) నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం సీఎం జగన్‌ (CM JAGAN)తో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఇటీవల ప్రభుత్వ, అధికారుల తీరుపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం మాటకే విలువలేదని కోటంరెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం ఆదేశించినా దర్గా అభివృద్ధికి నిధులు ఇవ్వలేదంటూ ఐఏఎస్ అధికారి రావత్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల (Pensions) తొలగింపు ఒక సంచలనంగా మారింది. పెన్షన్లను తీసివేయయడంపై వైసీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు తొలగించడం సరికాదని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (YCP MLA Kotamreddy Sridhar Reddy) అన్నారు. తమ నియోజకవర్గంలో 2,370 మందికి పెన్షన్లు తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. పెన్షన్లు వీలైతే ఇంకొందరికీ ఇవ్వాలని,.. పెన్షన్లు ఉన్నవారిని తొలగించొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు.

Updated Date - 2023-01-06T17:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising