ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anam Venkataramana Reddy: వైసీపీ ఎమ్మెల్యేలకు టైం అయిపోయింది..

ABN, First Publish Date - 2023-04-05T12:44:10+05:30

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి (Anam Venkataramana Reddy) కామెంట్స్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి (Anam Venkataramana Reddy) కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు (YCP MLAs) టైం అయిపోయిందని.. ఇంటికి వెళ్లాడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇక సంవత్సరం మాత్రమే ఉందని.. తిరిగి వడ్డీస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తల అరెస్టులకు, కేసులకు సమాధానం చెప్పాలన్నారు.

వైసీపీ నేతలు (YCP Leaders) చాలా మంది చంద్రన్న... చంద్రన్న... అని జపం చేస్తున్నారని.. 70 శాతం మంది నెల్లూరు జిల్లా నేతలు టచ్‌లో ఉన్నారని.. ఇంకా చాలా మంది రావచ్చునని ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. వైసీపీలో ఉన్నవారు కూడా ‘సైకో వద్దు.. సైకిల్ ముద్ద’ని అనుకుంటున్నారన్నారు. నెల్లూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం, రైల్వే స్టేషన్ వంటి పురాతనమైనవి కట్టింది మాజీమంత్రి అనీల్ అని.. ఆయన హయాంలో ఒక బ్రిడ్జి కట్టడానికి మూడేళ్లు పడుతుందన్నారు. నెల్లూరులో ఎన్ని రోడ్లు వేశారో చర్చకు సిద్ధమా? అంటూ ఆనం వెంకటరమణా రెడ్డి సవాల్ చేశారు.

Updated Date - 2023-04-05T12:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising