Nellore Dist.: ఉదయగిరి వైసీపీలో మళ్లీ రాజుకున్న విబేధాలు
ABN, First Publish Date - 2023-04-19T17:04:43+05:30
నెల్లూరు జిల్లా: ఉదయగిరి వైసీపీ (TCP)లో విబేధాలు మళ్లీ రాజుకున్నాయి. జలదంకిలో ఫ్లెక్సీల వివాదం (Controversy of Flexi) మరింత ముదురుతోంది.
నెల్లూరు జిల్లా: ఉదయగిరి వైసీపీ (TCP)లో విబేధాలు మళ్లీ రాజుకున్నాయి. జలదంకిలో ఫ్లెక్సీల వివాదం (Controversy of Flexi) మరింత ముదురుతోంది. రంజాన్ (Ramjan) శుభాకాంక్షలు తెలుపుతూ మండల పార్టీ కన్వీనర్ జనార్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మాజీ ఎమ్మెల్యే వంటేరు వర్గం తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో ఫ్లెక్సీ వద్ద కుర్చీ వేసుకుని మహిళా నేత తిప్పారెడ్డి ఇందిరమ్మ కూర్చున్నారు. ఎవరొస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. పలువురు నేతలు వచ్చి ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా తిప్పారెడ్డి ఇందిరమ్మ మాట్లాడుతూ రంజాన్ సందర్బంగా జలదంకిలో ఫ్లెక్సీ కట్టామని.. అదేమన్నా తప్పా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మండల పార్టీ కన్వీనర్ జనార్ధన్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నారు. అతనికి ఫోన్లు చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఫ్లెక్సీ కట్టిన బస్టాండ్ వద్ద తాను కూర్చున్నానని ధైర్యముంటే రావాలని తిప్పారెడ్డి ఇందిరమ్మ సవాల్ చేశారు. మీరు కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టాలని ఆమె సూచించారు.
అయితే రాత్రికి రాత్రే ఆ ఫ్లెక్సీ ఎదుట మాజీ ఎమ్మెల్యే వంటేరు అనుచరులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో జలదంకిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
Updated Date - 2023-04-19T17:04:43+05:30 IST