AP NEWS: గంటకు 8 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్న ‘’మిచాంగ్’’
ABN, First Publish Date - 2023-12-04T16:10:43+05:30
‘’మిచాంగ్’’ (Cyclone Michaung)తుఫాన్ తీవ్ర తుఫానుగా మారిందని, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు దూసుకొస్తోందని IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.
అమరావతి: ‘’మిచాంగ్’’ (Cyclone Michaung)తుఫాన్ తీవ్ర తుఫానుగా మారిందని, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు దూసుకొస్తోందని IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. సోమవారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది చెన్నైకి ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతుందన్నారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వెంబడి గాలుల వేగం గంటకు 90- 100 కి.మీ ఉందన్నారు. డిసెంబర్ 6 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించామన్నారు. ఉత్తర కోస్తా, తమిళనాడు మరియు ఏపీ, యానాంలో రెడ్ అలర్ట్ జారీ చేశామని మృత్యుంజయ్ మహపాత్ర పేర్కొన్నారు.
Updated Date - 2023-12-04T16:12:10+05:30 IST