Lokesh: లోకేశ్ యువగళం పాదయాత్రకు అనూహ్యమైన స్పందన
ABN, First Publish Date - 2023-07-04T10:39:39+05:30
జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకి అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు రూరల్‌లో పాదయాత్ర సాగుతుంటే రద్దీ వల్ల తానే వెళ్లలేక తిరిగొచ్చినట్లు చెప్పారు. మహాశక్తితో లోకేశ్ కార్యక్రమానికి 800 మందిని అంచనా వేస్తే 3 వేల మంది వచ్చారన్నారు.
నెల్లూరు: జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్రకు(YuvaGalam Padayatra) అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు రూరల్‌లో పాదయాత్ర సాగుతుంటే రద్దీ వల్ల తానే వెళ్లలేక తిరిగొచ్చినట్లు చెప్పారు. మహాశక్తితో లోకేశ్ కార్యక్రమానికి 800 మందిని అంచనా వేస్తే 3 వేల మంది వచ్చారన్నారు. నాయకుడంటే తిట్టడం... తిట్టించుకోవడం కాదని.. అభివృద్ధే లక్ష్యం కావాలన్నారు. తాను అభివృద్ధి గురించే ఆలోచిస్తానని... టీడీపీ హయాంలో నగరాన్ని ఎంత అభివృద్ది చేశామో అందరికీ తెలుసని నారాయణ వెల్లడించారు.
కాగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 145 రోజుల్లో 1892.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఇవాళ సాయంత్రం నెల్లూరు సిటీలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. వీఆర్సీ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో యువనేత పాల్గొననున్నారు. అనిల్ గార్డెన్స్ నుంచి కేవీఆర్, ఆర్టీసీ, మద్రాసు బస్టాండు, వీఆర్సీ, గాంధీబొమ్మ, కనకమహల్, బోసుబొమ్మ, ఆత్మకూరు బస్టాండు, స్టౌన్ హౌస్ పేట, పప్పుల వీధి, శెట్టిగుంట రోడ్డు, పెన్నా బ్రిడ్జి, వెంకటేశ్వరపురం సెంటర్ల మీదుగా సాలుచింతల వరకు లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు రాత్రి సాలుచింతలలో యువనేత బస చేయనున్నారు.
Updated Date - 2023-07-04T10:39:39+05:30 IST