ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: 136 రోజుల్లో 1770.7 కి.మీ. పాదయాత్ర పూర్తి‌ చేసిన లోకేశ్..

ABN, First Publish Date - 2023-06-25T10:58:00+05:30

నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆదివారం 137వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. 136 రోజుల్లో 1770.7 కి.మీ. పాదయాత్ర పూర్తి‌చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ (TDP) యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvagalamPadayatra) విజయవంతంగా సాగుతోంది. ఆదివారం 137వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. 136 రోజుల్లో 1770.7 కి.మీ. పాదయాత్ర పూర్తి‌చేశారు. ఈరోజు మేనకూరు నుంచి ఉడ్డిగుంట కండ్రిగ, గ్రద్దగుంట, తిమ్మాజీ కండ్రిగ, నాయుడుపేట, తుమ్మూరు, మర్లపల్లిమిట్ట మీదుగా అన్నమేడు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు నాయుడుపేట, గాంధీమందిరం సెంటర్‌లో లోకేష్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

కాగా లోకేష్ నిన్నటి పాదయాత్రలో సూళ్ళూరుపేట నియోజకవర్గం, వజ్జావారిపాలెం క్యాంపు సైటులో చర్చి ఫాస్టర్ల‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 2014లో రాష్ట్ర విభజన ఏపీ ప్రజల కోరికకాదని... కట్టుబట్టలతో బయటకి గెంటేశారని అన్నారు. కులమతాలకు అతీతంగా చంద్రబాబు పాలన సాగించారని తెలిపారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో పాలన మొదలైనా, ఎవరికీ ఇబ్బందులు లేకుండా పరిపాలించారని గుర్తుచేశారు.

జగన్ ప్రభుత్వంలో చర్చిలపైనా దాడులు జరిగాయన్నారు. పెళ్లికానుక, పండుగ కానుకలు ఎత్తేశారని మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అందరూ కలిసి పనిచేస్తేనే రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. గతంలో తాము చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకోలేకపోయామని.. అందుకే ఓడిపోయామన్నారు. టీడీపీ హయాంలో అనేక స్కీమ్‌లు తెచ్చామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య ఎత్తేశారని... పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని లోకేష్ అన్నారు. జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ఫాస్టర్లు అందరికీ బటన్ నొక్కితే ఐడీకార్డులు వచ్చేలా చూస్తామన్నారు. ఫాస్టర్లకి గౌరవవేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు... ప్రభుత్వమే మీ చుట్టూ తిరిగేలా చేస్తామమని యువనేత అన్నారు.

చంద్రబాబు బరయల్ గ్రౌండ్స్‌కు రూ.52వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. చర్చి నిర్మాణాలకు టీడీపీ సహాయం చేసిందని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం అన్ని కార్పోరేషన్లులానే క్రిష్టియన్ కార్పోరేషన్‌ను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటే చట్టాలు అతిక్రమించే వారికి భయమన్నారు. చట్టాలు కొందరికి చుట్టాలుగా మారాయని.. అందరికీ సమానంగా చట్టాలు అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. చర్చిలపైన వైసీపీ జెండాలు ఎగురవేస్తారని.. వ్యతిరేకంగా మాట్లాడితే ఫాస్టర్లను చర్చిల్లోకి రానివ్వరన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమని.. చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఒక్క నిమిషంలో లా అండ్ ఆర్డర్ సిట్ రైట్ చేస్తామన్నారు. శాశ్వత మేరేజ్ సర్టిఫికేట్లు ఇస్తామని.. క్రిస్టియన్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి అండగా ఉంటామని తెలిపారు. వైసీపీ నేతలపై వైసీపీ నేతలే దాడులు చేసుకునే విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు. దాడులు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు, గంజాయి మాఫియాలో నెంబర్ ఒన్‌లో ఉన్నామని లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-25T10:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising