Amaravathi: ఎట్టకేలకు ఆ మూడు శాఖలపై మంత్రి కాకాణి సమీక్ష
ABN, First Publish Date - 2023-05-11T16:30:31+05:30
అమరావతి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) గురువారం వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు.
అమరావతి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) గురువారం వ్యవసాయ (Agricultural), ఉద్యానవన (Garden), మార్కెటింగ్ (Marketing) శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తదితరులు హాజరయ్యారు. అకాల వర్షాలకు జరిగిన పంటల నష్టాల అంచన, నష్టపరిహారం అందించేందుకు చర్యలపై చర్చలు జరిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బికేల ద్వారా అందించడం, తదితర అంశాలపై మంత్రి కాకాణి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగం పట్ల అంచనాలు తయారు చేయడంలో, నష్టపరిహారం అందించడంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ అధికారులను కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాజీపడకుండా మొక్కజొన్న కొనుగోలు చేయడంతో పాటు, గిట్టుబాటు ధర లభించని ఇతర పంటలను గుర్తించి కొనుగోలు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సబ్సిడీ విత్తనాలు అందించేందుకు ఖరారు చేసిన యాక్షన్ ప్లాన్‌ను మంత్రి కాకాణి పరిశీలించారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఆర్బికేలలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కాకాణి ఆదేశించారు.
Updated Date - 2023-05-11T16:30:31+05:30 IST