Kotamreddy Sridharreddy: అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోగ్యవంతమైన రాజకీయాలు జరగాలి
ABN, First Publish Date - 2023-10-07T11:11:19+05:30
నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పధకం కింద ఎంపికైందని.. చాలా సంతోషంగా ఉందతీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేధించామని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుంచి తిరుమల వెళ్లెప్పుడు తొలి పాదం మోపిన ప్రాంతం వేదగిరి అని చెప్పుకొచ్చారు.
నెల్లూరు: నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పధకం కింద ఎంపికైందని.. చాలా సంతోషంగా ఉందతీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridharreddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేధించామని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుంచి తిరుమల వెళ్లెప్పుడు తొలి పాదం మోపిన ప్రాంతం వేదగిరి అని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇక్కడ కొనేర్లు, గిరిప్రదక్షిణ చేసే ప్రాంత అభివృద్ధి, దశావతారాల వద్ద అభివృద్ధి చేసేలా అడిగామని తెలిపారు. ‘‘నా ప్రయత్నంలో నాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) , మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Venkaiahnaidu), ఉషమ్మ, దీపా వెంకట్, డిఫెన్స్ అడ్వైజర్ సతీష్, అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబు ఎంతగానో సహకరించారు’’ అని చెప్పారు. గణేష్ ఘాట్, ఇరుకళల పరమేశ్వరి ఆలయం, భారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కీం కింద రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కిషన్ రెడ్డిని కోరుతున్నామని అన్నారు. నరసింహ కొండకి వెళ్లే దారిలో పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి, నూతన రోడ్లు సాంక్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ కోరుతున్నామని తెలిపారు. స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్ కోసం 1600 కోట్లతో అభివృద్ధి పనులను టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇంకా రాలేదన్నారు. కాంట్రాక్టర్‌కు త్వరగా సాంకేతికంగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామని.. నుడా అధికారులు లేఖ కూడా రాశారని.. దీనిపై ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదన్నారు. భారా షాహిద్ దర్గాలో కాంట్రాక్టర్ అభివృద్ధి పనులు ఆపేసి ఉన్నారని... ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో రాజకీయాలు వద్దని ఎమ్మెల్యే హితవుపలికారు.
పార్టీ నుంచి మాత్రమే బయటకు వచ్చా..
అలానే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 కోట్లు, ముస్లిం షాదీ మంజిల్‌కు మరో రూ.5 కోట్లు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా కోరుతున్నట్లు తెలిపారు. టీడీపీ హయాంలో ముస్లిం, దళితులు, గిరిజనుల పిల్లల కోసం గురుకుల పాఠశాలలో 95 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 5 శాతం పనులు ఈ ప్రభుత్వ హయాంలో పూర్తికాలేదని... పిల్లలు ఆటో నగర్‌లో పొల్యూషన్ మధ్య చదువుతున్నారని వెల్లడించారు. ఆమంచర్ల సెజ్ కోసం 500 ఎకరాల పారిశ్రామిక వాడ కట్టాలని టీడీపీ హయాంలో 52 కోట్ల రూపాయలు రైతులకు పరిహారం కూడా ఇచ్చారన్నారు. 10 వేల మందికి ఉపాధి వచ్చే ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సాంకేతికంగా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని...అయితే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారన్నారు. ఆయన సంతాప సభలో ఈ విషయాన్ని సీఎం ఎదుట చెప్పానని... ఇంకా పని మొదలు కాలేదన్నారు. తాను అధికార పార్టీలో నుంచి బయటకి వచ్చానని.. ప్రజల సమస్యలను గాలికి వదిలేయలేదని.... వైసీపీ నేతలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. నగరంలో కమిషనర్ ఇంటిని కట్టడంలో ఉన్న శ్రద్ధ... పిల్లల గురుకుల పాఠశాలపై పెట్టాలన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోగ్యవంతమైన రాజకీయాలు జరగాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
Updated Date - 2023-10-07T11:11:19+05:30 IST