ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy: స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి..

ABN, First Publish Date - 2023-06-07T11:13:00+05:30

అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ (CBI) విచారణ జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజల నుంచి దోచుకుంటున్న రూ.17వేల కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఏ ఫిర్యాదులేని మార్గదర్శి (Margadarsi)పై విశ్వసనీయత దెబ్బతీయటమే లక్ష్యంగా విచారణ చేస్తున్న సీఐడీ (CID)కి, ప్రజలు జేబులు దోచుకునే ఇంత పెద్ద కుంభకోణాలు పట్టవా? అని ప్రశ్నించారు. మోటర్ల రేటు కంటే మీటర్ల రేటు రెండింతలు ఎలా ఎక్కువో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

ప్రకృతి, ప్రభుత్వ సంపదను కొల్లగొట్టిన సీఎం జగన్ (CM Jagan).. ఇప్పుడు స్మార్ట్‌గా ప్రజల జేబులు కొల్లగొడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. మధ్య యుగాల్లో పిండారీ లాంటి బంధిపోటు దొంగల్ని తలపించేలా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని, మైంటైనెన్స్‌తో కలిపి స్మార్ట్ మీటర్ల ధర రూ.10 వేలు ఉంటేనే యూపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందన్నారు. అలాంటిది ఏపిలో రూ.36,977కు స్మార్ట్ మీటర్లను ఎలా ఏర్పాటు చేస్తున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒక కంపెనీకి లక్షల సంఖ్యలో మోటార్లు ఆర్డర్ ఇస్తే 50 శాతం రాయితీపై ఇస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ మీటర్ల ఏర్పాటు టెండర్లలో ఎల్1 షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఉంటే.. ఎల్2గా ఆదానీ సంస్థ ఉందన్నారు.

గృహావసరాల విద్యుత్ మీటర్ల టెండర్‌లో ఎల్1 ఆదానీ సంస్థ అయితే ఎల్2గా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నిలిచిందని సోమిరెడ్డి అన్నారు. రెండు రకాల టెండర్లలో రెండు సంస్థలు కేవలం వందల రూపాయల తేడాతో ఎల్1, ఎల్2లుగా నిలవడం క్విడ్ ప్రోకో కాదా? అని ప్రశ్నించారు. యూపీ వద్దనుకున్న అదానీ సంస్థ.. ఏపీకి ముద్దయిందా? అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినాష్ రెడ్డి తన బినామీ కంపెనీ షిరిడీ సాయి ఎలాక్ట్రికల్స్ ద్వారా భారీ దోపిడీకి తెరలేపారన్నారు. ఈ డీల్ మొత్తం కడప షిరిడీ సాయి ఆఫీసులోనే జరిగిందన్నది సుస్పష్టమన్నారు. గూగుల్ టేక్ అవుట్ తీసుకుంటే ఆవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో షిరిడీ సాయి కార్యాలయంలో సీఎండీ, అధికారులు సమావేశమై ధరలు నిర్ణయించారన్నది బయటకొస్తుందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-06-07T11:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising