Odisha Train Accident: ప్రమాదానికి గురైన రైలులో ఏపీ ప్రయాణికులు ఎంతమంది ఉన్నారంటే...
ABN, First Publish Date - 2023-06-03T13:03:38+05:30
ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాద బాధితుల సమాచారం కోసం తెనాలిలో 227600 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెనాలి స్టేషన్ మాస్టర్ టీవీ రమణ తెలిపారు.
తెనాలి: ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాద బాధితుల సమాచారం కోసం తెనాలిలో 227600 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెనాలి స్టేషన్ మాస్టర్ టీవీ రమణ తెలిపారు. బాధితుల సమాచారం కోసం ఈ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే హౌరా - యశ్వంతపూర్ రైలులో బాపట్లలో 2, బెజవాడలో 4, చీరాలలో 12 మంది రిజర్వేషన్లు చేయించుకున్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం వచ్చే అనేక రైళ్లు రద్దు అయ్యాయని, పలు రైళ్లను దారి మళ్లించామన్నారు. కాగా రైలు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తమ వారి వివరాల కోసం కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వాళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.
Updated Date - 2023-06-03T13:55:08+05:30 IST