ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సభ ఏర్పాట్లలో అధికారుల అత్యుత్సాహం.. వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికేసి..

ABN, First Publish Date - 2023-02-27T19:12:10+05:30

విశాలమైన రోడ్డు ఉంది.. వాహనాలకు ఎటువంటి ఆటంకం లేదు.. అయినా సంవత్సరాల నుంచి పెరుగుతూ వచ్చిన మహా వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: విశాలమైన రోడ్డు ఉంది.. వాహనాలకు ఎటువంటి ఆటంకం లేదు.. అయినా సంవత్సరాల నుంచి పెరుగుతూ వచ్చిన మహా వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. కాన్వాయ్‌ కోసం విశాలమైన రోడ్డుకు ఇరువైపుల ఉన్న భారీ వృక్షాలను భద్రతా కారణాల పేరుతో నరికేశారు. అంతేకాదు పక్కనే జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఉన్నా, రోగులకు ఇబ్బందవుతుందన్న ఆలోచన కూడా లేకుండా త్రీఫేస్‌ విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సభావేదికకు అటు, ఇటు మూడు కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేట్లు కట్టేశారు. ఒక్క మనిషికూడా ఇళ్లలో నుంచి బయటకు రావటానికి వీలు లేకుండా కట్టడి చేసేశారు. ఇదంతా మంగళవారం తెనాలి వస్తున్న సీఎం జగన్ (CM Jagan) సభకోసమే కావటం విశేషం. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతుభరోసా (RythuBharosa), పీఎం కిసాన్‌ మొత్తాలను రైతుల ఖాతాల్లో వేసే పనిలో భాగంగా మీట నొక్కేందుకు జగన్‌ తెనాలి వస్తున్న సంగతి తెలిసిందే.

రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు మీట నొక్కే కార్యక్రమం మాత్రం కేవలం గంటసేపటిలో ముగిసిపోతుంది. అయితే జనానికి మాత్రం రెండు రోజులుగా ఇబ్బందులు తప్పటంలేదు. ఓవర్‌ బ్రిడ్జి దగ్గర నుంచి అంగలకుదురు దగ్గర వరకు మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా ఇనుప రాడ్‌లతో బారికేట్లు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇళ్లవారికి ఇబ్బందులు తప్పటంలేదు. సోమవారం సాయంత్రం నుంచి ఎవరూ బయటకు రావటానికి వీలులేదని, దుకాణాల వంటివి మూసివేయాలనే ఆదేశాలు అందాయి. దీనికితోడు మార్కెట్‌ యార్డుదాటాక గుంటూరు (Guntur) రోడ్డులో అంగలకుదురు, జె.ఎం.జె కళాశాలల దగ్గర ట్రాఫిక్‌ మళ్లించేందుకు మార్గాలుకూడా ఉన్నాయి. సభావేదిక దగ్గరలోనే సీఎం హెలిప్యాడ్‌ (CM Helipad) ఉండటంతో, అంత దూరంలో కఠిన ఆంక్షలు పెట్టాల్సిన అవసరంకూడా లేదని, ఆ మార్గాల వెంటన వెళ్లనిస్తే ఇబ్బంది ఉండదని, కానీ మొత్తం నారాకోడూరు నుంచే ట్రాఫిక్‌ మళ్లించటంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

బారీకేడ్లు ఏర్పాట్లు

తెనాలి వ్యవసాయ మార్కెట్‌ (Tenali Agricultural Market) ప్రాంగణంలో జగన్ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్‌కు రెండు వైపులా ప్రధాన ద్వారాలు ఉండగా సీఎం సభకు కొత్తగా తెనాలి- అంగలకుదరు ప్రధాన రహదారి నుంచి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చేరే రోడ్డులోకి మార్కెట్ యార్డు గోడను పగలగొట్టి రోడ్డు మార్గం ఏర్పాట్లు చేస్తున్నారు. సుల్తానాబాద్‌లోని కవిరాజానగర్ వద్ద ఏర్పాట్లు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం దిగనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వ్యవసాయ మార్కెట్‌లోని వేదికకు వస్తారు. ఈ క్రమంలో సీఎం వచ్చే రోడ్డుమార్గంలో బారీకేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెనాలి, బాపట్ల ఇతర ప్రాంతాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు 130 కేటాయించారు.

సీఎం షెడ్యూల్ ఇదే

ఈ నెల 28 ఉదయం 9:55 గంటలకు సీఎం తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 10:15 గంటలకు తెనాలిలోకి కవిరాజ లే అవుట్‌లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 10:35కి సభా వేదిక ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ వద్దకు చేరుకుంటారు. తొలుత స్టాల్స్ సందర్శించి లబ్దిదారులతో మాట్లాడుతారు. 10:45 గంటల నుంచి 12:15 గంటల వరకు వైఎస్‌ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తారు. 12:20రి తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.

Updated Date - 2023-02-27T19:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising