Pawan Varahi Yatra: సీఎం పీఠానికి విలువ ఇస్తా.. జగన్‌కు కాదంటూ పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-09T21:02:49+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శలు గుప్పించారు.
ఏలూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శలు గుప్పించారు.
ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారంటే..
"సీఎం పీఠానికి విలువ ఇస్తాను.. జగన్‌కు కాదు. వైసీపీ నాయకుల రాజకీయ విలువలు మాట్లాడుతున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారు. సీఎంను ఇక నుంచి ఏకవచనంతోనే పిలుస్తాను. వైసీపీ నాయకులను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడతాను. సీఎం పదవికి జగన్ అనర్హుడు. వైసీపీ ఈ రాష్ట్రానికి సరైనది కాదు. ఏలూరులో వరదల వస్తే ఎందుకు మునిగిపోతుంది.. రక్షణ గోడలు ఏమయ్యాయి." అని జనసేన అధినేత ప్రశ్నించారు.
కాగ్ నిన్ను ఎందుకు ప్రశ్నించింది.?
"మనం జగన్‌కు బానిసలం కాదు. సీఎం పదవికి బానిసలం కాదు. మనలో ఒకడు అంతే. మన శ్రమశక్తితో కట్టే పన్నులకు, ఖజానాకు సీఎం జవాబుదారీ. మన రాష్ట్ర ఖజానా రూ. 10 లక్షల కోట్లు. వాటిని ఎలా ఖర్చుపెట్టారో మనకు చెప్పాలి. ప్రజాస్వామ్యం అంటే చాలా కష్టమే.. కాపలా కాయాలి. జగన్ రూ. లక్షా 18 వేల కోట్లు అప్పు తీసుకుని ఎందుకు ప్రజలకు లెక్క చెప్పలేదు. కాగ్ నిన్ను ఎందుకు ప్రశ్నించింది. దానికి నువ్వు, నీ మంత్రులు సమాధానం చెప్పాలి. రూ. 22 వేల కోట్లు లిక్కర్ బాండ్లపై అప్పు తీసుకుని, ఆ డబ్బు ఏం చేశారు. రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు ఏం చేశావో నువ్వు, నీ మంత్రివర్గం రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు." అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కాగ్ నివేదికలపై పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. పోరాటం చేస్తే విజయం వస్తుందో లేదో తెలీదని, అయినా పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు.
Updated Date - 2023-07-09T21:23:40+05:30 IST