Peddireddy Ramachandra Reddy : ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా.. మేము ఒంటరిగానే పోటీ చేస్తాం
ABN, First Publish Date - 2023-06-14T12:03:51+05:30
ఏపీలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సీఎం జగన్ సహా అధికార పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. నేడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
అనంతపురం : ఏపీలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సీఎం జగన్ సహా అధికార పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. నేడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విపక్ష పార్టీలు 2014 లోమాదిరిగానే మళ్ళీ 2024 లో కలిసి పోటీ చేస్తాయేమో కానీ తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. తాము ప్రజలకు మంచి చేశామని.. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడు అయ్యాడు కాబట్టి అందిరి సహకారం అవసరమన్నారు. రాయలసీమకు ఎవరు ఎంత మేలు చేశారో ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి తెలిపారు.
Updated Date - 2023-06-14T12:10:15+05:30 IST