ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: బీసీలకు శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు: నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-04-06T21:28:43+05:30

ఆరు నెలలకు ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి నుంచి బీసీలకు విముక్తి కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: ఆరు నెలలకు ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి నుంచి బీసీలకు విముక్తి కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. మొబైల్‌లో ఒక్క బటన్‌ నొక్కగానే ఇంటికే బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు వచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అవి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగపడేలా, టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే చట్టంలో మార్పులు తీసుకొస్తామని అన్నారు. తద్వారా బీసీలపై వేధింపులు, ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో గురువారం 62వ రోజు యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కొనసాగింది. ఉరవకొండ నియోజకవర్గం (Uravakonda Assembly constituency)లోని కూడేరు సమీపంలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్‌ పాదయాత్ర కొనసాగించారు. 62వ రోజు నారా లోకేశ్‌ 15.5 కి.మీ. నడక సాగించారు. ఇప్పటి వరకూ 805.4 కి.మీ. నడిచారు. కూడేరు నుంచి గార్లదిన్నె మండలంలోని మర్తాడు సమీపంలోని విడిది కేంద్రం వరకూ సాగిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. ప్రజా సంఘాల నేతలు, ప్రజలు తమ సమస్యలను లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

కరువునేలపై చంద్రబాబు ఆకుపచ్చని సంతకం

కూడేరు ప్రాంతంలో డ్రిప్‌ ద్వారా సాగు చేస్తున్న పచ్చని పొలాలను చూసిన నారా లోకేష్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే కరువు జిల్లాలో తాగునీటికే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కరువు నేలలో పంట కుంటలు తవ్వించామని, చెక్‌డ్యాంలు నిర్మించామని గుర్తుచేశారు. భూగర్భ జలాలను పెంచేందుకు టీడీపీ హయాంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సబ్సిడీ తో డ్రిప్‌ పరికరాలు అందించామని, నీటిని పొదుపుగా వాడుకొని రైతులు బంగారు పంటలు పండించారని అన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌తో సాగు చేస్తున్న పచ్చని పంట పొలాలను చూసి సెల్ఫీ దిగుతూ ‘కరువు నేలపై చంద్రబాబు (Chandrababu) ఆకుపచ్చని సంతకమిది’ అని అన్నారు.

Updated Date - 2023-04-06T21:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising