ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN Effect: దుర్గమ్మ అంతరాలయంలో వీడియోలు తీసింది ఎవరో తేలింది

ABN, First Publish Date - 2023-01-03T19:13:49+05:30

బెజవాడ దుర్గమ్మ (Bezawada Kanaka durga) అంతరాలయంలో వీడియోల చిత్రీకరణ వ్యవహారంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) ఎఫెక్ట్‌తో ఆలయ యంత్రాంగం కదిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెజవాడ దుర్గమ్మ (Bezawada Kanaka durga) అంతరాలయంలో వీడియోల చిత్రీకరణ వ్యవహారంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) ఎఫెక్ట్‌తో ఆలయ యంత్రాంగం కదిలింది. సీసీటీవీ ఫుటేజీల ద్వారా వీడియోలు తీసింది ఎవరో గుర్తించారు. శాంతకుమారి అనే భక్తురాలు వీడియోలు చిత్రీకరించినట్లు గుర్తించామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22న ఉ.9.52 గంటలకు భక్తురాలు చిత్రీకరించినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై ఫిర్యాదు చేశామని ప్రకటించారు. దుర్గగుడిలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసినట్టు భ్రమరాంబ పేర్కొన్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన బెజవాడ దుర్గమ్మ (Bezawada Kanaka durga) అంతరాలయం వీడియోలు (Viedo) సోషల్‌ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతుండడం వెలుగుచూసింది. అమ్మవారి మూలవిరాట్‌ను ఎవరో వ్యక్తులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు. కనకదుర్గ టెంపుల్‌ ఐటీలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు వెలుగు చూశాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగివుండొచ్చనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కాగా అమ్మవారి వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై మండిపడుతున్నారు. ఈ చర్యకు పాల్పడినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-01-03T19:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising