ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 59.77 శాతం పోలింగ్‌

ABN, First Publish Date - 2023-03-13T21:19:11+05:30

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ (MLC) స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో 59.77 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి అంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ (MLC) స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో 59.77 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి అంటే సాయంత్రం నాలుగు గంటలకు పలు కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరి ఉన్నారు. వారంతా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం మరింత పెరగనున్నదని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో 59.77 శాతం పోలింగ్‌ (Polling) జరిగినట్టు రిటర్నింగ్‌ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో సోమవారం ఉదయం మందకొడిగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు పది శాతం మాత్రమే జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 23.85 శాతం, రెండు గంటలకు 40.81 శాతం మంది ఓటేశారు.

ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకుగాను 1,72,851 మంది (59.77 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో గరిష్ఠంగా 73.3 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District)లో 68.51 శాతం, పార్వతీపురం మన్యంలో 62.61 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 60.73 శాతం, అనకాపల్లి జిల్లాలో 54.2 శాతం, అతి తక్కువగా విశాఖపట్నం జిల్లాలో 53.62 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా సాయంత్రం నాలుగు గంటలకు పలు కేంద్రాల్లో ఓటర్లు ఉన్నారు. ఆయా చోట్ల గేట్లకు తాళాలు వేసి లోపల వున్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చారు.

Updated Date - 2023-03-13T21:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising