Tenali: తహసీల్దార్ కార్యాలయానికి పవర్ కట్
ABN, First Publish Date - 2023-01-19T20:42:40+05:30
గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయానికి గురువారం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలతో ఆశాఖ సిబ్బంది విద్యుత్ సర్వీసును తొలగించారు.
తెనాలి: గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయానికి గురువారం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలతో ఆశాఖ సిబ్బంది విద్యుత్ సర్వీసును తొలగించారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లు చెల్లించడంలేదన్న ఆరోపణతో ఆ శాఖ అధికారులు సర్వీసును నిలుపుదల చేశారు. రెవెన్యూశాఖ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుందని తహసీల్దార్ రవిబాబు (Tehsildar Ravi Babu) విజ్ఞప్తి చేసినా విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలంటూ సర్వీస్‌ను తొలగించడంతో కార్యాలయం చీకటి మయంగా మారింది. దీంతో చేసేదేమీలేక తహసీల్దార్ రవిబాబు, సిబ్బందితో కలిసి వరండాలోనే కూర్చుని విధులు నిర్వహించారు. సాయంత్రం వరకూ కూడా విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయానికి విద్యుత్‌ను పునరుద్ధరించలేదు.
Updated Date - 2023-01-19T20:42:41+05:30 IST