KA Paul: నాకు పుట్టిన రోజు గిప్ట్‌గా స్టీల్‌ప్లాంట్ అమ్మకం ఆపారు
ABN, First Publish Date - 2023-10-04T14:13:45+05:30
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, రూపాలాకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు’’ అని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel plant) ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ (PM Modi), అమిత్ షా (Amit Shah), రూపాలాకి (Rupala) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (Prajashanti party chief KA Paul) కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు’’ అని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ (BRS) కేఏ పాల్‌ను చూసి భయపడుతుందన్నారు. కేసీఆర్ (CM KCR), కాంగ్రెస్ (Congress) కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 2న ప్రజాశాంతి పార్టీ సభకు జింఖానా గ్రౌండ్‌లో కేసీఆర్ అనుమతి ఇవ్వలేదన్నారు. మళ్ళీ కాంగ్రెస్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరబోతున్నారు కాబట్టి ప్రజాశాంతి పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. మందుకొట్టి కొత్త మేనిఫెస్టో తెస్తా అంటున్నారని.. మరో 6 లక్షల కోట్లు అప్పు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
8 సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కాపు పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు కొనేశారని అన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ నుంచి పోటీ చేసేందుకు 3600 మంది పోటీకి అప్లై చేశారని తెలిపారు. ప్రజాశాంతి ఐఏఎస్, ఐపీఎస్‌లు రిటైర్డ్ అధికారులు పోటీకి సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టికెట్లు రాకపోతే రెబల్ కాకండి అని అందరు కలిసి అభ్యర్థిని నిర్ణయిద్దామని తెలిపారు. జనగామ, సంగారెడ్డి, సికింద్రాబాద్ ప్రజలు తనను కోరుకుంటున్నారన్నారు. 79 స్థానాల్లో ప్రజాశాంతి గెలుస్తుందని ధీమా వ్యకత్ం చేశారు. దొంగ కావాలంటే కేసీఆర్, గజదొంగ కావాలంటే రేవంత్‌ను ఎన్నుకోవాలని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి ఓటు వేసిన బీఆర్ఎస్‌కు వేసినట్లే అని అన్నారు. క్రీస్తు విరోధి పార్టీ బీజేపీ నుంచి జయసుధ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు. తాను ఎవరికి అమ్ముడుపోలేదని.. మమత బెనర్జీ ,స్టాలిన్ మాయావతి అందరూ అమ్ముడుపోయారని కేఏపాల్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-10-04T14:13:45+05:30 IST