ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : అర్ధరాత్రి బస్సు ప్రమాదం.. ఏం జరిగిందో తెలిసేసరికి చిన్నారి సహా ఏడుగురి దుర్మరణం..

ABN, First Publish Date - 2023-07-11T07:40:47+05:30

ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది.. ఇక మిగిలింది వివాహ రిసెప్షన్. ఆనందోత్సాహాల నడుమ బంధుమిత్రులందరితో కలిసి ఓ బస్సులో వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అనుకోని ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బస్సు ఎదురుగా రావడంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీకొట్టిన బస్సు.. ఆపై అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం : ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది.. ఇక మిగిలింది వివాహ రిసెప్షన్. ఆనందోత్సాహాల నడుమ బంధుమిత్రులందరితో కలిసి ఓ బస్సులో వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అనుకోని ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బస్సు ఎదురుగా రావడంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీకొట్టిన బస్సు.. ఆపై అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి.. చిమ్మ చీకటి.. ఏం జరుగుతోందో తెలియదు. అంతా నిద్రమత్తులో ఉన్నారు. సాగర్ కాలువలో బస్సు పడటంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. ఊపిరి ఆడలేదు. అంతే ఏడేళ్ల చిన్నారి, ఐదుగురు మహిళలు సహా మొత్తంగా ఏడుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి సాగర్ కాలువలోకి పెళ్లి బస్సు దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. పొదిలి నుంచి కాకినాడలో వివాహ రిసెప్షన్ కి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి 47 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

రాత్రి 12:50 కు ఎదురుగా మరో బస్సు రావటంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీ కొట్టడంతో అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. బస్సులో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు.18 మందికి గాయాలు అయ్యాయి. సాగర్ కాలువలో పడిన బస్సును బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. సీరియస్‌గా ఉన్న నలుగురిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీస్,ఫైర్ సిబ్బంది స్పందించి సహాయక చర్యలలో పాల్గొన్నారు. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ పరిశీలించారు.

మృతులు :

అబ్దుల్ అజీజ్(65),

అబ్దుల్ హనీ(60),

షేక్ రమీజ్(48),

ముల్లా నూర్జాన్(58),

ముల్లా జానీ బేగం(65),

షేక్ షభీనా(35),

షేక్ హీమా(7)

Updated Date - 2023-07-11T07:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising