ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్న ఏపీ సీఎం

ABN, First Publish Date - 2023-04-12T13:19:44+05:30

రాష్ట్రంలో అక్కా, చెల్లమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రకాశం: రాష్ట్రంలో అక్కా, చెల్లమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan mohan reddy) అన్నారు. బుధవారం జిల్లా పర్యటలో భాగంగా మార్కపురంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... ‘‘ఈబీసీ నేస్తం’’ అక్క, చెల్లెళ్ళకు లబ్ధి చేకూర్చే కార్యక్రమమని అన్నారు. 4,39,068 మంది అక్క, చెల్లెళ్ళకు రూ.658.60 కోట్ల సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ మొదలు వృద్ధురాలి వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. ప్రతీ మహిళను వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో పేద అక్కా, చెల్లెమ్మలకు వారి ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయటం లేదని సీఎం చెప్పారు.

అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలకు అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. పేదరికానికి చికిత్స చేయాలని తాపత్రయంతోనే పనిచేస్తున్నామని అన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 46 నెలల కాలంలో రూ.2.07 లక్షల కోట్ల నగదు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. బ్యాంకులకు నగదు కట్టలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల ద్వారా 30 లక్షల మందికి ఇల్లు నిర్మించామని, ప్రతీ మహిళ మొబైల్‌లోకి దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించామన్నారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

Updated Date - 2023-04-12T13:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising