ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flexy Controversy: ఒంగోలులో వివాదాస్పదమైన అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ

ABN, First Publish Date - 2023-06-28T10:46:05+05:30

ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna), జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh), ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని (MLA Balaneni Srinivas), కలెక్టర్ దినేష్ కుమార్ (Collector Dinesh Kumar) ఫోటోలు కానరాకుండా పోయాయి. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలు వేయకపోవడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమ తప్పేంటో గుర్తించిన విద్యాశాఖ అధికారులు తప్పును సరిదిద్దుకున్నారు. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించి మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే విద్యాశాఖ తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ (CM YS Jaganmohan Reddy) అమ్మఒడి పథకం నాలుగో ఏడాది నిధులను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, పలువురు వైసీపీ నాయకులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో జగన్ పార్వతీపురం బయలుదేరి వెళ్లారు. పార్వతీపురం జిల్లా చినమేరంగి పాలిటెక్నిక్‌ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకోనున్న జగన్.. అక్కడి నుంచి కురుపాం బహిరంగ సభ వద్దకు వెళ్లనున్నారు. అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-06-28T10:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising