Balineni Srinivas: వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచో చెప్పేసిన బాలినేని
ABN, First Publish Date - 2023-08-15T13:02:38+05:30
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Former Minister Balineni Srinivas reddy) ప్రకటించారు. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. మంగళవారం మీడియాతో బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. కొంత మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని... వాటిని నమ్మొద్దని అన్నారు.
ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Former Minister Balineni Srinivas reddy) ప్రకటించారు. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. మంగళవారం మీడియాతో బాలినేని మీడియాతో మాట్లాడారు. కొంత మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని, వాటిని నమ్మొద్దని ఖండించారు.
వచ్చే నెలలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని బాలినేని శ్రీనివాస్ చెప్పారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పంపిణీలో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. 25వేల మందికి జగన్ అన్నఇళ్ల పట్టాలు పంపిణీకి రంగం సిద్దం చేస్తే టీడీపీ వాళ్ళు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతుంటే టీడీపీకి కోర్టులో కేసులు వేయడం ఏం పని అంటూ ప్రశ్నించారు. ‘‘పేదలకు పంచే ఇళ్ల పట్టాల పంపిణీలో నేను సంపాదించాలనుకుంటే రూ.500 కోట్లలో రూ.50 కోట్లు సంపాదించుకోవచ్చు.. కానీ నేను సింగిల్ రూపీ కూడా ముట్టుకోలేదు’’ తెలిపారు. గతంలో ఒంగోలులో టిడ్కో ఇళ్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
Updated Date - 2023-08-15T13:20:35+05:30 IST