AP News : పాఠశాల భవనం ఆక్రమణదారులపై చర్యలకు హైకోర్టు ఆదేశం
ABN, First Publish Date - 2023-07-27T14:27:32+05:30
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పాఠశాల భవనాన్ని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని భవనాన్ని కాపాడాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పాఠశాల భవనాన్ని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని భవనాన్ని కాపాడాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూలు భవనాన్ని ఆక్రమించి, ప్రైవేటు కట్టడాలు కట్టాలని చూస్తున్నారని ఏరువానిపల్లికి చెందిన కేశవరపు ఆదం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు.
ప్రభుత్వ స్కూలు భవనాన్ని అక్రమంగా ఆక్రమించి ప్రైవేటు భవనాలు కట్టడానికి రాజకీయ నాయకుల అండదండలతో ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు. జిల్లా విద్యాధికారి, సబ్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా, కింది స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. లాయర్ వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. తక్షణమే స్కూల్ భవనాన్ని పరిరక్షించి అక్రమ దారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2023-07-27T14:27:32+05:30 IST