ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పందేలకు సై..

ABN, First Publish Date - 2023-01-13T21:28:20+05:30

కోడిపందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో పలుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి రోజున యథావిధిగానే అనుమతి వస్తుందన్న ధీమా నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం: కోడిపందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో పలుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి రోజున యథావిధిగానే అనుమతి వస్తుందన్న ధీమా నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పందేలు జరగనున్నాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ అరడజను నుంచి 10 బరుల వరకు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాలలో అధికార పార్టీ నాయకుల వారసులే కోడిపందేల నిర్వహణ బాధ్యత చేపడుతున్నారు.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కొందరికి మాత్రమే పందేల బరుల అనుమతులు ఇస్తున్నారు. అనుమతులకు సంబంధించి ఇప్పటికే భీమవరం (Bhimavaram) నియోజకవర్గంలో అధికార పార్టీలో గ్రూపు వివాదాలు బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలం, భీమవరం పట్టణ శివారు, పాలకొల్లు (Palakollu), ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో చిన్న పెద్ద కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. వాటి వెనుకనే జూదాలు నిర్వహణ సాగుతుంది. పెద్దస్థాయిలో జరిగే బరుల వద్ద సిట్టింగ్‌ ఏర్పాట్లు, ఫ్లడ్‌లైట్లు అవసరమైన చోట ఎల్‌ఈడీలు ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2023-01-13T21:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising