కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: పాడేరు రోడ్డు ప్రమాదంపై పురందేశ్వరి స్పందన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

ABN, First Publish Date - 2023-08-20T17:11:02+05:30

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు.

Purandeswari: పాడేరు రోడ్డు ప్రమాదంపై పురందేశ్వరి స్పందన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

అమరావతి: అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన ప్రమాద బాధితులను విశాఖ తరలించాలని సూచించారు. గాయపడిన వారిలో చిన్నారులు మహిళలు ఉన్నారని, వైద్య అధికారులు కూడా సంఘటనా స్థలానికి వెళ్ళేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో దుర్మరణం పాలైన వ్యక్తుల కుటుంబాలకు బీజేపీ తరపున తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పురందేశ్వరి ప్రకటించారు.


పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం (road accident Paderu) జరిగింది. పాడేరు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు (RTC BUS) బోల్తా పడింది. చెట్టుని తప్పించబోయి ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Updated Date - 2023-08-20T17:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising