ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandheswari : టీటీడీ చైర్మన్ అనేది రాజకీయ పునరావాస పదవి కాదు

ABN, First Publish Date - 2023-08-08T13:45:27+05:30

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డ్ చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకమున్న వాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరన్నారు.

అమరావతి : వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డ్ చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకమున్న వాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరన్నారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగిందని పురందేశ్వరి అన్నారు. ఈ విషయంపై గళం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడంతో జరిగిందన్నారు. అంటే ఈ ప్రభుత్వం నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలగానే పరిగణిస్తున్నారని అర్థమవుతుందన్నారు. కనుక టీటీడీ చైర్మన్ పదవిలో హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని.. హిందూ ధర్మం అనుసరించే వాళ్ళను నియమించాలని దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.

Updated Date - 2023-08-08T13:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising