Purandeswari : విజయసాయిరెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి పురందేశ్వరి ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-11-04T11:19:14+05:30
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు.
అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు. విజయసాయి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జిగా వున్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పురందేశ్వరి పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పు దోవ పట్టించారన్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను పురందేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-04T11:19:15+05:30 IST