ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: శ్రీవారి ఆలయ శుద్ధి

ABN, First Publish Date - 2023-03-21T20:16:50+05:30

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో బుధవారం నాటి ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో బుధవారం నాటి ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని నీటితో శుభ్రంగా కడిగారు. ఆలయంలో శ్రీవారి మూలవిరాట్టును పూర్తిగా వస్త్రంతో కప్పివేశారు. ఆలయ శుద్ధి తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేశారు. అనంతరం మూలవిరాట్టుకు కప్పిన వస్ర్తాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులను (Devotees) దర్శనానికి అనుమతించారు.

శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానం జరుగనుంది. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనులవారికి విశేష సమర్పణ చేస్తారు.ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వచ్చి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్ర్తాలు సమర్పించి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. తర్వాత ఉగాది ఆస్థానాన్ని పండితులు ఆలయంలోని బంగారు వాకిలిలో శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. కాగా, ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌, పుష్పాలంకరణల్లో శ్రీవారి ఆలయం ప్రత్యేక అందాలతో దర్శనమిస్తోంది.

Updated Date - 2023-03-21T20:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising