ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rains: ఏపీలో వర్షాలు

ABN, First Publish Date - 2023-03-26T19:49:21+05:30

తమిళనాడు (Tamil Nadu) నుంచి కర్ణాటక (Karnataka), మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా బిహార్‌ వరకు ద్రోణి విస్తరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: తమిళనాడు (Tamil Nadu) నుంచి కర్ణాటక (Karnataka), మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా బిహార్‌ వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో ఆదివారం కోస్తాలో ఎక్కువచోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో.. రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదివారం రాయలసీమ (Rayalaseema)లో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఎండతీవ్రత కొనసాగింది. అనంతపురం (Anantapur)లో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతను నిలువునా ముంచేశాయి. చేతికి అందాల్సిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో బాధిత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వర్షం వేలాది హెక్టార్లలో పంటలకు అపార నష్టం మిగిల్చింది. కోత దశలో ఉన్న అరటి, కొర్ర తదితర పంటలతో పాటు తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటలు తడిసి ముద్దయ్యాయి. అదేవిధంగా బెండ, నూగు, సజ్జ పంటలు మరో 50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం వల్ల మామిడి, అరటి, వరి, నూగు పంటలు దెబ్బతిన్నాయి.

నూగు, వరి పంటల్లో నీరు నిలవడం వల్ల పంట నేలకొరిగింది. చేతికొచ్చే పంట నేలకొరగడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వరి, నూగు, సజ్జ పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట ఈదురుగాలులు, వర్షం వల్ల నేలకొరగడంతో రైతులు నష్టాల పాలయ్యారు. వర్షం అంటేనే రైతులు హడలిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షం వస్తుదని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-26T19:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising