Relationship: తల్లి, తమ్ముడు చెప్పారని భార్యని 14 ఏళ్ల పాటు...
ABN, First Publish Date - 2023-03-02T14:03:13+05:30
కట్టుకున్న భార్యను పద్నాలుగేళ్లపాటు చీకటి గది (Dark Room)లో బంధించాడు.. కట్టుకున్న పాపానికి బంధీని చేసి కన్నవారికి, బాహ్య ప్రపంచానికి దూరం చేశాడా ప్రబుద్ధుడు. తప్పుడు, చెప్పుడు మాటలు విని తోడుండాల్సిన వాడు..
విజయనగరం: కట్టుకున్న భార్యను పద్నాలుగేళ్లపాటు చీకటి గది (Dark Room)లో బంధించాడు.. కట్టుకున్న పాపానికి బంధీని చేసి కన్నవారికి, బాహ్య ప్రపంచానికి దూరం చేశాడా ప్రబుద్ధుడు. తప్పుడు, చెప్పుడు మాటలు విని తోడుండాల్సిన వాడు.. ఒంటరిని చేసి మానసికంగా(Psychological) వేధించాడీ దుర్మార్గుడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పద్నాలుగేళ్ల పాటు నరకం చూపించాడు. పవిత్ర న్యాయవాద వృత్తిలో ఉండి అతనే సర్వస్వం అనుకున్న భార్యకు చుక్కలు చూపించాడు ఆ శాడిస్టు(Sadist) భర్త. చీకటి గదిలో మగ్గిన ఆ మహిళ పరిస్థితి అందరినీ కలచివేసింది. తట్టుకోలేని ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో బాధితురాలికి విముక్తి లభించింది. చాలాకాలం తర్వాత కూతురిను చూసిన తల్లి కన్నీటి భాష్పాలు అందరికీ కంటతడి పెట్టించాయి.
వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లా (Sathya Sai District)కు చెందిన సాయి సుప్రియకు విజయనగరం(Vizianagaram) పట్టణానికి చెందిన గోదావరి లాయర్ మధుసూదన్‌తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. న్యాయవాది మధుసూదన్ తన తల్లి, తమ్ముడి మాటలు విని కట్టుకున్న భార్యను బయట ప్రపంచానికి దూరం చేశాడు. ఏకంగా పద్నాలుగేళ్లపాటు చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడూ బయటకు తీసుకు వచ్చేవాడు కాదు. పిల్లల్ని కూడా తల్లిదగ్గరకు వెళ్లనివ్వడు. తన తల్లితోనే పిల్లల ఆలనా పాలనా చూపించేవాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పద్నాలుగేళ్లు నరకం చూపించాడు.
మధుసూదన్ బంధువులు, సాయిసుప్రియ తల్లిదండ్రులు ఆరాతీస్తే నేను లాయర్‌ని అని బెదిరించేవాడు. తమ కుమార్తె బతికి ఉందో లేదో కూడా తెలియని స్థితిలో సాయి సుప్రియ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక 14ఏళ్లు నరకయాతన అనుభవించారు. చివరికి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకొని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
సాయిసుప్రియ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 28న పోలీసులు గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్లిన పోలీసులను మధుసూదన్ తనిఖీ చేయకుండా అడ్డుకున్నాడు. ‘‘మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా" అని పోలీసులను మధుసూదన్ ఎదురు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు.
Updated Date - 2023-03-02T15:34:55+05:30 IST