Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియకు రిమాండ్
ABN, First Publish Date - 2023-05-17T19:31:28+05:30
మాజీమంత్రి భూమా అఖిలప్రియకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్రామ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అఖిలప్రియ దంపతులను కర్నూలు జైలుకు తరలించారు. బుధవారం ఉదయం భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు.
నంద్యాల: మాజీమంత్రి భూమా అఖిలప్రియ (Ex Ministrer Bhuma Akhila Priya)కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్రామ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరికి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. నంద్యాల నుంచి అఖిలప్రియ దంపతులను కర్నూలు జైలుకు తరలించారు. బుధవారం ఉదయం భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. నిన్న రాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో (Yuvagalam Padayatra) టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy).. అఖిల ప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. ఈ ఘటనలో సుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భూమా అఖిలప్రియ అరెస్ట్‌తో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Updated Date - 2023-05-17T19:31:28+05:30 IST