Renuka Chowdary : జగనొక మెంటల్.. ఏమైనా చేస్తాడు.. చంద్రబాబుకు అంతా అండగా నిలవాలి
ABN, First Publish Date - 2023-09-13T12:52:12+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రాజమండ్రి జైలు చంద్రబాబుకు సేఫ్ కాదన్నారు. సొంత బాబాయినే చంపుకున్న వాడికి చంద్రబాబు ఒక లెక్కా అని ప్రశ్నించారు.
ఖమ్మం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రాజమండ్రి జైలు చంద్రబాబుకు సేఫ్ కాదన్నారు. సొంత బాబాయినే చంపుకున్న వాడికి చంద్రబాబు ఒక లెక్కా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి అందరూ అండగా నిలవాలన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. చంద్రబాబు కేసును సుప్రీం సుమోటోగా తీసుకుని విచారించాలన్నారు.
ఇంకా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ‘‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్సందించాలి. చంద్రబాబుకు కేంద్రం జాతీయ స్థాయిలో పటిష్టమైన భద్రత కల్పించాలి. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. జగనొక మెంటల్. జగన్‌కు నా సొంత ఖర్చుతో మానసిక చికిత్స చేయిస్తా. రాజ్యాంగంలో మార్పులు తేవాలి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి నాయకులంతా తాము మానసికంగా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాలని చట్టం చేయాలి. జగన్ మానసిక స్థితి సరిగా లేదు... ఏమైనా చేస్తాడు. బంగారం లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-09-13T13:19:05+05:30 IST