ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పూర్తి వివరాలు ఇవే..

ABN, First Publish Date - 2023-10-04T17:54:49+05:30

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపికబురు అందించింది.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ

ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపికబురు అందించింది. తమ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలు (డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.


"టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది." అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

Updated Date - 2023-10-04T17:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising