పోలవరం ప్రాజెక్టు వద్ద మీడియాపై ఆంక్షలు
ABN, First Publish Date - 2023-06-06T10:34:03+05:30
నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను ఏపీ సీఎం జగన్ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు వద్ద మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, పత్రికా ఫోటోగ్రాఫర్లకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులను డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికే పరిమితం చేశారు.
ఏలూరు : నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను ఏపీ సీఎం జగన్ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు వద్ద మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, పత్రికా ఫోటోగ్రాఫర్లకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులను డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికే పరిమితం చేశారు. అక్కడ నుంచి ఎటూ వెళ్ళకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అధికారుల తీరుపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో జగన్ పోలవలం ప్రాజెక్ట్‌కు చేరుకున్నారు. 10.10 నుంచి నేరుగా ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే, అప్పర్ కాపర్ డ్యాంలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాలులో మధ్యాహ్నం 11.30 నుంచి 12.30 గంటల వరకూ నిర్మాణ పనులు, ఆర్.అండ్.ఆర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.10గంటలకు క హెలికాప్టర్‌లో జగన్ తాడేపల్లి బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్, సమీప ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు విధించారు.
Updated Date - 2023-06-06T10:34:03+05:30 IST