ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sajjala: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పర్యటనలపై సజ్జల రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2023-08-18T18:52:09+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.


"సంవత్సరం నుంచి వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమని పవన్ అంటున్నారు. అందరం కలుస్తాం అన్నారు. ఇద్దరం కలుస్తామన్నారు. ఒక్కరం అయినా రావచ్చు, ఇద్దరం రావచ్చు. ముగ్గురు కలిసి రావచ్చు అని మరళా చెప్పారు. ఇది నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదని అందరికి తెలుసు. 2019లో చంద్రబాబు పవన్‌ను విడిగా పోటీ చేయమన్నారు. ఇప్పడు కలిసి చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారు. వారు విడిగా పోటీచేసినా.. కలిసి పోటీ చేసినా వారు ఇద్దరూ కలిసే ఉన్నారు. చంద్రబాబునాయుడుతో బేరం పెంచుకోవడానికి ఓసారి అటు ఇంకో సారి ఇటు మాట్లాడుతున్నారు. టీటీడీ బోర్డు మెంబర్లు వేయడం డ్యూ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. కొన్ని పత్రికల్లో వచ్చే వార్తలనే రెండవ ఫిడేల్ వాయించే వ్యక్తిగా పవన్ మాట్లాడుతున్నారు." అని సజ్జల అన్నారు


"జగన్ వైజాగ్ వెళతారు అని తెలియగానే ఒకరి తరువాత ఒకరు అక్కడికి వెళ్లి అక్కడి వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేశారు. వైజాగ్ రాజధాని కాకూడదని వారి కోరిక. అందుకే వారు ఒక రోజు ఓ గుంత దగ్గరకు.. ఇంకోరోజు ఓ గుట్ట దగ్గరకు.. మరో రోజు ఇసుక దిబ్బల వద్దకు వెళుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని పర్యావరణ రక్షణ వారే చేస్తున్నట్టు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతున్న మాటలు అన్ని చంద్రబాబుకు సరిపోతాయి. చంద్రబాబు నిలబడడానికి శక్తిలేక పవన్‌ను పెట్టుకున్నారు. పవన్ ఆయన్ను మోస్తున్నారు." అని సజ్జల మండిపడ్డారు.


చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌పై సజ్జల ఫైర్

"2014-19 మధ్య చంద్రబాబు ఎందుకు విజన్ డాక్యుమెంట్ చేయలేదు చెప్పాలి. చంద్రబాబు మాట్లాడే మాటలు ఒక విజనరీ అయిన వ్యక్తి మాట్లాడిన మాటలులా లేవు. వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తి మాటలులా ఉన్నాయా ప్రజలే అర్ధం చేసుకోవాలి. టీడీపీ అధినేతను పగటి వేషగాడు అనాలా పిట్టలదొర అని అనాలా. చంద్రబాబు తనను తాను తిట్టుకోవాల్సిన తిట్లు జగన్‌ను తిడుతున్నారు. చంద్రబాబు లాగా 50 ఏళ్ల ప్లాన్లు జగన్ వేయడంలేదు. ఈ ఏడాది ప్రణాళిక వేస్తే వచ్చే ఏడుకే అమలు చేస్తున్నారు." అని సజ్జల అన్నారు.

Updated Date - 2023-08-18T18:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising